![]() |
![]() |
.webp)
కొన్ని విషయాలు తెలియకుండా జరిగిపోతాయి. అవి జరిగాక అయ్యో ఇప్పుడెలా అని అనుకుంటాం. అలా అనుకోకుండా జరిగేవాటినే షాకింగ్ విషయాలని అంటాం. ఇప్పుడదే జరిగింది. జబర్దస్త్ రాకింగ్ రాకేష్ వాళ్ళ భార్య జోర్దార్ సుజాత అతనికి షాక్ ఇచ్చింది. అసలేం జరిగింది.. ఏంటా షాక్ ఓసారి చూసేద్దాం.
సుజాతకి ఒకరి దగ్గరి నుండి కాల్ వస్తుంది. ఆ ఫోన్ మాట్లాడిన సుజాత.. కాస్త సంతోషంగా మాట్లాడతుంది. రాకేష్ ని పిలిచి ఓ గుడ్ న్యూస్ అని అంటుంది సుజాత. ఏంటా గుడ్ న్యూస్ అనగా.. అమ్మ వస్తుందంట.. ఓ నాలుగు రోజులు ఇక్కడే ఉంటుందంట అని సుజాత అనేసరికి.. ఒక్కసారిగా ఆలోచిస్తాడు రాకేష్. షూటింగ్ ఉందని చెప్పు.. నాలుగు రోజులు కాదు కాదు వారం రోజులు.. అసలు హైదరాబాద్ లోనే ఉండట్లేదని చెప్పేయ్ అని సుజాతతో రాకేష్ అంటాడు. అవునా ఎందుకని సుజాత అడుగగా.. అలాగే చెప్పని రాకేష్ అంటాడు. ఆ తర్వాత సుజాత కాల్ చేస్తుంది. హలో అత్తమ్మ మేము అవుట్ డోర్ షూటింగ్ కి వెళ్తున్నాం. నాలుగు రోజులు అవుతుందో తెలియదు. పది రోజులు అవుతుందో తెలియదు. ఎప్పుడొస్తామో తెలియదని సుజాత అంటుంది. అది విని రాకేష్ షాక్ అవుతాడు. ఇదంతా 'చంటబ్బాయ్' యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేశాడు రాకింగ్ రాకేష్.
రాకేష్ ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్స్ లో రాకేష్ కూడా ఒకరు. నార్మల్ గా కామెడీ చేసే స్టేజి నుంచి ఎదుగుతూ వచ్చి ఇప్పుడు టీం లీడర్ అయ్యాడు. తన కామెడీ పంచులు, డైలాగులతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు. రీసెంట్ గా జోర్దార్ సుజాతను పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కలిసాక రాకేష్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. జబర్దస్త్ స్టేజి మీద ఈ జోడీకి ఎంతో క్రేజ్ ఉంది.
![]() |
![]() |